న్యాయపత్రం కాదు.. కాంగ్రెస్‌ది అన్యాయపత్రం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాయలంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

Update: 2024-04-21 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాయలంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ న్యాయపత్రాన్నని ప్రజలు అన్యాయపత్రంగా భావిస్తున్నారని తెలిపారు. బీజేపీ వికాస భారత్ నినాదం.. కాంగ్రెస్‌ది విభజిత భారత్ నినాదం అని విమర్శించారు. ముస్లిం లీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని పేర్కొన్నారు. ఓట్ల కోసమే ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మరో మేనిఫెస్టో ప్రకటించి.. ప్రజలను మరో మోసం చేయడానికి సిద్ధమైందని అన్నారు. ఉచితాలు, గ్యారంటీలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని సిద్ధపడిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో బీజేపీ 12 స్థానాల్లో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి, ప్రధాని మోడీకి రోజురోజుకూ ఆద‌ర‌ణ పెరుగుతోందన్నారు. అందుకే మోడీ చ‌రిష్మాను త‌గ్గించి చూపేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీక‌టి ఒప్పందం చేసుకున్నాయ‌ని ఆరోపించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే గులాబీ పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యార‌ని ఈ రెండు పార్టీలు క‌లిసి గేమ్ ఆడుతున్నాయ‌ని ల‌క్ష్మణ్ ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 50 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News