RS ప్రవీణ్ కుమార్ గెలుపు బాధ్యత వీరిదే
నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారు. ఏడుగురు సభ్యులతో కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించారు. ఏడుగురు సభ్యులతో కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రకటించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ సమన్వయకర్తగా రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యనాయక్, గద్వాల్ అసెంబ్లీకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్, ఆలంపూర్ కు పార్టీ సీనియర్ నాయకులు దేవరమల్లప్ప, కల్వకుర్తికి పార్టీ సీనియర్ నాయకుడు చాడ కిషన్ రెడ్డి, వనపర్తి అసెంబ్లీకి పార్టీ సీనియర్ నాయకుడు బైకానీ శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట అసెంబ్లీకి పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, కొల్లపూర్ అసెంబ్లీ సమన్వయకర్తగా సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ను నియమించారు. ఎన్నికల ప్రచారంను ముమ్మరం చేయాలని, పార్టీ ఇచ్చే కార్యక్రమాలను విధిగా నిర్వహించి కేడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికలకు మరో నెలరోజులు మాత్రమే గడువు ఉందని, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. కాగా, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు.