IPL 2025 : ఐపీఎల్ ముందు ఢిల్లీ కీలక నిర్ణయం.. ఆర్సీబీ మాజీ కెప్టెన్‌కు ఆ బాధ్యతలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల తమ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల తమ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఢిల్లీ మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే సీజన్‌లో అక్షర్‌కు సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను డిప్యూటీగా నియమించింది. డు ప్లెసిస్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మెగా వేలంలో డు ప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవాన్ని ఫ్రాంచైజీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికాను నడిపించాడు. అలాగే, ఐపీఎల్‌లో 2022-24 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో ఆర్సీబీ రెండు సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నా.. ఎలిమినేటర్‌లో ఓడింది.