హైదరాబాద్‌లో IPL మ్యాచ్.. మఫ్టీలో మహిళా పోలీసులు.. ఎందుకంటే?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా(Cricket Lovers) వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా(Cricket Lovers) వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుండగా.. తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరుగబోతోంది. ఇక రెండోరోజు ఆదివారం నాడు డబుల్ ధమాకా ఉండబోతోంది. రెండు మ్యాచులతో అభిమానులను ఐపీఎల్(IPL) అలరించబోతోంది. 23వ తేదీన మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగనుంది. ఇక రెండో మ్యాచ్ అత్యంత కీలకమైన జట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలోని చిదంబరం మైదానం(Chidambaram Stadium) వేదికగా ఉండనుంది.
అయితే, 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా మ్యాచ్ ఉండటంతో హెచ్‌సీఏ(HCA) అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్, 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా, 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మైదానంలో క్రికెట్ అభిమానులు అత్యుత్సాహం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.