IPL-2025: ముంబై జట్టుకు కొత్త కెప్టెన్.. హార్దిక్ పరిస్థితి ఏంటంటే?
క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్(IPL- 2025) ప్రారంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్(IPL- 2025) ప్రారంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ కోల్‌కతా వర్సెస్ బెంగళూరు(Kolkata vs Bengaluru) మధ్య ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరుగనుంది. మార్చి 23వ తేదీన చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వర్సెస్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మరో మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ముంబై జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. గతేడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరంగా ఉండనున్నాడు.
దీంతో చెన్నైతో జరుగబోతున్న ఫస్ట్ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని ముంబై జట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ అనంతరం మళ్లీ యథావిధిగా హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడని ముంబై యాజమాన్యం పేర్కొంది. హార్దిక్‌తో పాటు తొలి మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆడటం లేదు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బూమ్రా జట్టులో ఎప్పుడు చేరబోతున్నాడో యాజమాన్యానికి కూడా క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. అయితే.. హార్దిక్, బూమ్రా లేకపోవడంతో సూర్యకుమార్, తిలక్ వర్మతో పాటు దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) బాధ్యతతో ఆడాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.