భద్రతా బలగాల వాహనం పేల్చిన ఘటనలో ఆరుగురు మావోలు అరెస్ట్

ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం టేకులగూడెం సమీపంలో ఈనెల 23న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు.

Update: 2024-06-26 13:38 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం టేకులగూడెం సమీపంలో ఈనెల 23న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. ఈ సంఘటనలో కోబ్రా 201 బెటాలియన్ కు చెందిన విష్ణు, శైలేంద్ర అను ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జవాన్లు మృతి చెందిన మూడు రోజుల్లోనే ఛత్తీస్​ఘడ్ పోలీసులు ఇందుకు కారణమైన ఆరుగురు మావోలను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన మావోల నుండి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహన్ తెలిపారు. 

Similar News