రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు

ట్రాక్టర్ బైకు ఢీకొని వీఆర్ఏ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకిరికి తీవ్ర గాయాలైన సంఘటన బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్ గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-06-26 15:28 GMT

దిశ,బషీరాబాద్ : ట్రాక్టర్ బైకు ఢీకొని వీఆర్ఏ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకిరికి తీవ్ర గాయాలైన సంఘటన బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్ గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన దశరథ్ (55) అదే గ్రామానికి చెందిన మహబూబ్ సాబ్ బషీరాబాద్ నుంచి తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారుకు చేరుకోగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో దండేటి దశరథ్ (వీఆర్ఏ) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ సాబ్ కు తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్ సబ్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి దశరథ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు.

Similar News