గంజాయి విక్రేతలు అరెస్ట్

జనగామ పోలీసులు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు జనగామ

Update: 2024-06-26 16:20 GMT

దిశ,జనగామ: జనగామ పోలీసులు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు జనగామ పట్టణంలో సాయంత్రం పెట్రోలింగ్ చేశారు. యశ్వంత్పూర్ గ్రామ సమీపంలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఇద్దరు వ్యక్తులు స్పెండర్ బైక్ పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు పట్టుకుని విచారించగా వారి వద్ద గంజాయి ఉన్నదని తెలిపారు.. నేరస్తులు అగు గంట బాబు అంబేద్కర్ నగర్ జనగామ,(రెండవ వ్యక్తి మైనర్) అని వారి వద్ద 700 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని, దాని విలువ రూ.15000 అని వారిపై జనగామ సీఐ ఎల్.రఘు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

Similar News