200 కిలోల నవసాగ్రం పట్టివేత

నాటుసారా తయారీలో వినియోగించే నవసాగ్రాన్ని బుధవారం ఎక్సైజ్‌ అండ్ ఎన్ఫోర్స్ మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-06-26 12:14 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : నాటుసారా తయారీలో వినియోగించే నవసాగ్రాన్ని బుధవారం ఎక్సైజ్‌ అండ్ ఎన్ఫోర్స్ మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో దీనిని నగరంలోని బేగంబజార్ నుండి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. నాటుసారా తయారీలో బెల్లంతోపాటు ఉపయోగపడే నవసాగ్రం బేగంబజార్ నుండి ఖమ్మం తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్‌ సీఐ బాలరాజ్‌, రవిలు దాడి చేసి ఐదు సంచుల్లో 10 కిలోల చొప్పున ఉండే 20 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిని వాహనంలో ట్రాన్స్ పోర్ట్ కు తరలిస్తుండగా పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వారు వివరించారు.

Similar News