ఎస్ఐ బదిలీలు ఒకటో సారి.. రెండో సారి
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీలలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. నగర వ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా పోలీస్ సిబ్బందికి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో రెండో సారి జారీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు మాసాలుగా వివిధ సందర్భాల్లో పలువురు అధికారులను విడతల వారీగా సీపీ అంజనీకుమార్ బదిలీ చేశారు. కానీ, వీరెవరూ పాత […]
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐల బదిలీలలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. నగర వ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా పోలీస్ సిబ్బందికి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో రెండో సారి జారీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు మాసాలుగా వివిధ సందర్భాల్లో పలువురు అధికారులను విడతల వారీగా సీపీ అంజనీకుమార్ బదిలీ చేశారు.
కానీ, వీరెవరూ పాత పోస్టింగ్‌ల నుంచి కదల్లేదు. దీంతో కోపోద్రిక్తులైన సీపీ అంజనీకుమార్ శుక్రవారం రాత్రి మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, గతంలో పలుమార్లు బదిలీ అయినా కూడా రిలీవ్ కానీ వారందరితో జాబితాను తయారు చేసి మొత్తం 64 మంది ఒకేసారి బదిలీ చేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అయితే, ఈ సారైనా బదిలీ అయిన ఎస్ఐలు తమ పాత పోస్టింగ్ లను అట్టే పెట్టుకుని ఉంటారా.. అక్కడి నుంచి రిలీవ్ అవుతారో, లేదో చూడాలి. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగంలో 20 మంది అసిస్టెంట్ కమాండెంట్ లను, మరో ఇద్దరు సివిల్ ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.