బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి : నెన్నెల నర్సయ్య
దిశ, మంచిర్యాల : ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర నాయకులు నెన్నెల నర్సయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 56 శాతం, దేశ జనాభాలో 60 శాతం బీసీలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో మాత్రం రాష్ట్రంలో 9 శాతం, దేశంలో 14 శాతం దాటలేదని తెలిపారు. బీసీ జనాభా ధమాషా […]
దిశ, మంచిర్యాల : ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర నాయకులు నెన్నెల నర్సయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 56 శాతం, దేశ జనాభాలో 60 శాతం బీసీలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో మాత్రం రాష్ట్రంలో 9 శాతం, దేశంలో 14 శాతం దాటలేదని తెలిపారు.
బీసీ జనాభా ధమాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి తోకల మహేష్, సత్యనారాయణ, సదానందం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.