మంచిర్యాలలో తొలి కరోనా.. చనిపోయిన మహిళకు పాజిటివ్
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. నిన్నటి వరకు కరోనా ఫ్రీ జిల్లాగా పేరు తెచ్చుకున్నా శుక్రవారం తొలి కేసు నమోదు కావడంతో స్థానికంగా కలకలం రేపుతున్నది. మృతిచెందన మహిళ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరికి దూరంగా ఉండే మహిళకు కరోనా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తురావుపేట గ్రామానికి […]
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. నిన్నటి వరకు కరోనా ఫ్రీ జిల్లాగా పేరు తెచ్చుకున్నా శుక్రవారం తొలి కేసు నమోదు కావడంతో స్థానికంగా కలకలం రేపుతున్నది. మృతిచెందన మహిళ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అందరికి దూరంగా ఉండే మహిళకు కరోనా
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తురావుపేట గ్రామానికి చెందిన 47 ఏండ్ల మహిళకు రెండేండ్ల క్రితం కరెంట్ షాక్ తగలడంతో మంచం పట్టింది. అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. అంతేకాకుండా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదని సమాచారం. అసలు ఆమెకు కరోనా ఎలా సోకిందనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
జ్వరంతో మంచిర్యాలకు వెళ్లి
ఈ నెల 13న జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళ మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ ఎక్స్ రే కూడా తీయించారు. జ్వరం లక్షణాలు అర్థంకాక ఆమెను ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
చనిపోయిన తర్వాత కరోనా నిర్ధారణ
వైద్యుల సూచన మేరకు గాంధీకి వెళ్లిన మహిళను పరీక్షించడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆమె నగరంలోని కింగ్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లారు. అందులో అడ్మిట్ కాకముందే 14వ తేదీ ఉదయం ఆ మహిళ మరణించింది. ఆమె మరణానికి గల కారణం తెలుసుకునేందుకు కోఠి వైద్యులు శాంపిల్స్ సేకరించి పరిశీలించగా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.
18 మంది అనుమానితులు తరలింపు
కరోనా సోకిన మహిళకు మొదట వైద్య పరీక్షలు చేసిన ఆర్ఎంపీపై కేసు పెట్టాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. అనంతరం మృతి చెందిన మహిళ కలిసిన ఇద్దరు వైద్యులతోపాటు, ఆరుగురు కుటుంబ సభ్యులు, మరో 10 మందిని మందమర్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్టు వైద్యాధికారులు వెల్లడించారు.
Tags: carona, 47yrs old women died, carona positive, collecter orders arrest rmp docter