పంజాబ్ యూనివర్శిటీలో 42 మందికి అస్వస్థత

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో ఆహారం తీసుకున్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థులందరూ అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరు వైద్యులు క్యాంపస్‌లో పరిస్థితులను పర్యవేక్షించాలని పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ సందీప్ కాజల్ సివిల్ ఆస్పత్రి […]

Update: 2021-02-27 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో ఆహారం తీసుకున్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు.

ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థులందరూ అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరు వైద్యులు క్యాంపస్‌లో పరిస్థితులను పర్యవేక్షించాలని పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ సందీప్ కాజల్ సివిల్ ఆస్పత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News