పండుగ పూట బస్సు ప్రమాదం.. 32 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : పండుగ వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నేపాల్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల […]

Update: 2021-10-12 23:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పండుగ వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నేపాల్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు.

విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం మృతదేహాలను వెలికి తీశారు.

Tags:    

Similar News