యాదాద్రి ఆలయంలో 30 మందికి పాజిటివ్

దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు దాదాపు 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 11రోజులుగా స్వామి, అమ్మవార్ల వార్షిక బ్రహ్మో త్సవాలు నిర్వహించిన దేవస్థానం అధికారులు ఉత్సవాల అనంతరం కరోనా వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పారాయణ దారులు మొదలుకుని రుత్విక్కులకు, వేదపండితులకు, ఆలయ అర్చకులకు, దేవస్థానం సిబ్బందికి covid-19 వ్యాప్తి చెందడంతో […]

Update: 2021-03-27 10:39 GMT

దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు దాదాపు 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 11రోజులుగా స్వామి, అమ్మవార్ల వార్షిక బ్రహ్మో త్సవాలు నిర్వహించిన దేవస్థానం అధికారులు ఉత్సవాల అనంతరం కరోనా వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పారాయణ దారులు మొదలుకుని రుత్విక్కులకు, వేదపండితులకు, ఆలయ అర్చకులకు, దేవస్థానం సిబ్బందికి covid-19 వ్యాప్తి చెందడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయం తెలియడంతో ఆర్జిత సేవలను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో గీతా రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News