హైదరాబాద్ పై ‘ఆమ్నెస్టీ’ సంచలన రిపోర్టు.. ‘నిఘా నుంచి ఎవరూ తప్పించుకోలేరు’

by Anukaran |   ( Updated:2021-11-10 08:22:26.0  )
హైదరాబాద్ పై ‘ఆమ్నెస్టీ’ సంచలన రిపోర్టు.. ‘నిఘా నుంచి ఎవరూ తప్పించుకోలేరు’
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నివేదికను బయటపెట్టింది. భాగ్యనగరంలో ప్రతీ ఒక్కరిని నిఘా కళ్లు వెంటాడుతున్నాయని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థగా ఆమ్నెస్టీకి పేరుంది. పౌరులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పొలిటికల్, ఎకానమీ, రక్షణ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన జర్నల్స్‌ను ఈ సంస్థ ప్రచురిస్తుంటుంది. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని నిఘా వ్యవస్థ (సీసీ కెమెరాల)పై ఆమ్నెస్టీ సంస్థ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

హైదరాబాద్ మహానగరాన్ని నిఘా కళ్లు మొత్తం కప్పేశాయని, సంపూర్ణ నిఘా నగరంగా మారడానికి ఎంతో దూరం లేదని పేర్కొంది. ‘ఫేషియల్ రికగ్నిషన్‌కు గురికాకుండా వీధుల్లో నడవటం దాదాపు అసాధ్యం’ అని స్పష్టం చేసింది. అయితే, పౌరులను ఆపడానికి, తనిఖీలు చేయడానికి మరియు ఎలాంటి ఆరోపణలు లేకుండా ఫోటోలు తీయడానికి ట్యాబ్లెట్‌లను ఉపయోగించే చట్టాన్ని అమలు పరచడంలో అనుమతులు అవసరం లేకుండా పోతుందని వెల్లడించింది. దీని ప్రకారం నగరంలో జర్నీ చేసే వ్యక్తులు ఏ మాత్రం అనుమానంగా సంచరించిన వారిని నిఘా కళ్లు గుర్తించి పోలీసులకు పట్టించే అవకాశం ఉందట. భద్రతతో పాటు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తప్పవని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed