- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో రూ.5కోట్ల కరెన్సీతో అమ్మవారు అలంకరణ
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్టోన్ హౌస్‌పేట శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రులు కనులపండుగా జరుగుతున్నాయి. అమ్మవారు సోమవారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందులో భాగంగా సోమవారం అమ్మవారికి ఐదు కోట్ల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేశారు. ఏర్పాట్లను నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పర్యవేక్షించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలను నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు నుడా చైర్మన్ ద్వారకానాథ్ తెలిపారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు విశేష సేవలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాగా, ధనలక్ష్మి అలంకారం సందర్భంగా దేవస్థానాన్ని అత్యంత సుందరంగా అలంకరించేందుకు భక్తులు తమ వంతు సహకారం అందించారు. రూ.5కోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.