30 రోజుల్లో ప్రేమించడం ఎలా? టీం మదర్స్ డే ట్రీట్

by Shyam |   ( Updated:2024-06-02 16:25:23.0  )
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? టీం మదర్స్ డే ట్రీట్
X

మదర్స్ డే సందర్భంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా నుంచి స్పెషల్ సాంగ్ లిరికల్ ప్రోమో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. తన కొడుకు రిషన్ రూబెన్స్ పాడిన పాటను తల్లులు అందరికీ అంకితం ఇచ్చింది మూవీ యూనిట్.

అమ్మా.. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. అమ్మా.. అమ్మా.. మరలా లాలించవా.. పది నెలలు ప్రతీ క్షణం కడుపున పెంచావే.. పది నెలలు ప్రతీ నిమిషం ఒడిలో పెంచావే..అంటూ సాగిన పాట ఆకట్టుకుంటోంది. మనం పుట్టినప్పటి నుంచి లాక్ డౌన్ అయిన మన అమ్మలకు అంకితం ఇచ్చారు.

యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తుండగా.. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.వి. బాబు నిర్మాత.

Advertisement

Next Story