- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన హషీమ్ ఆమ్లా
దిశ, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కౌంటీ క్రికెట్‌లో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఒక రోజంతా క్రీజులో నిల్చున ఆమ్లా.. డబుల్ సెంచరీకి పైగా బంతులు ఆడి కనీసం హాఫ్ సెంచరీ పరుగులు కూడా చేయలేదు. కానీ తన జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించాడు. సౌతాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే తరపున బరిలోకి దిగిన హషీమ్ ఆమ్లా 278 బంతులు ఆడి 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్ షైర్ జట్టు 488 పరుగులు చేసింది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 174 పరుగులు చేయడంతో హాంప్ షైర్ కౌంటీ భారీ పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సర్రే జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫాలో ఆన్ ఆడిన సర్రే మరోసారి కష్టాల్లో పడింది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన హషీమ్ఆమ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన అద్భుతమైన డిఫెన్స్‌తోరోజంతా క్రీజులోనే ఉన్నాడు. 100 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసిన ఆమ్లా.. తొలి బౌండరీని 125వ బంతికి బాదాడు. రోజంతా ఆడిన ఆమ్లా మొత్తం 278 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆమ్లా కారణంగా సర్రే జట్టు చివరి రోజు 8 వికెట్ల నష్టానికి 122 స్కోరుతోనిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆమ్లా బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.