మహిళకు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్

by Shyam |   ( Updated:2020-12-29 01:24:17.0  )
మహిళకు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయనకు నచ్చిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతూనే ఉంటారు. తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితలను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేసే బచ్చన్ జీ.. ఈ మధ్య ‘టీ’కి సంబంధించిన ఓ అందమైన కవిత షేర్ చేశారు. నవ్వు, ఆనందం, ఊహలను ఇంగ్రేడియెంట్స్‌గా మార్చుతూ రాసిన ఈ ‘స్పెషల్ టీ’ కవితకు వేల లైక్‌లు, లక్షల కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్ చేసిన వారిలో తిషా అగర్వాల్ అనే మహిళ ఒకరు కాగా.. అది తను రాసిన కవితే అని బచ్చన్‌కు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన బిగ్ బీ.. తనకు క్రెడిట్స్ ఇవ్వకుండా కవితను షేర్ చేసినందుకు సారీ చెప్పారు. ఫార్వార్డ్ మెసేజ్‌గా వచ్చిన కవిత తనకు నచ్చిందని అందుకే షేర్ చేశానని తెలిపారు.

https://twitter.com/SrBachchan/status/1343238769273569280?s=20

https://twitter.com/TishaAgarwal14/status/1343252936088940544?s=20

దీంతో తిషా అగర్వాల్.. ‘బచ్చన్ జీ మీ ట్విట్టర్ వాల్ పేపర్‌పై నా కవిత రావడం అదృష్టంగా, ఉత్తమ బహుమతిగా భావిస్తున్నా. ఒక చిన్న రచయితకు మీ కలం నుంచి మీ పేరును తీసుకోవడం కన్నా ఇంకా ఏం కావాలి? అని చెప్పింది.

Advertisement

Next Story