మేము కాదు.. మీ మనస్తత్వం మార్చుకోండి : ఆ సీఎంకు అమితాబ్ మనవరాలి కౌంటర్!

by Shamantha N |   ( Updated:2021-03-17 11:53:26.0  )
మేము కాదు.. మీ మనస్తత్వం మార్చుకోండి : ఆ సీఎంకు అమితాబ్ మనవరాలి కౌంటర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో నేటి యువత ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్‌‌ను ఇష్టపడుతున్నారు. అబ్బాయిలే అనుకుంటే వారితో పోటీ పడి మరీ యువతులు లెటేస్ట్ ట్రెండ్స్‌ను అలవాటు చేసుకుంటున్నారు. అందులో జీన్స్, టీషర్ట్స్‌తో పాటు చిరిగిన ప్యాంట్లు, షర్ట్స్ సైతం ఉంటున్నాయి. దాంతో పాటు షార్ట్ లెన్త్ టాప్స్, 3/4 షార్ట్స్ సైతం ధరించి యువతులు నిర్మోహమాటంగా బయట సంచరిస్తున్నారు. అది వారికి ఫ్యాషన్ లా అనిపిస్తే.. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించే వ్యక్తులు మాత్రం అలాంటి వారిని తప్పుబడుతున్నారు. ఇలాంటి వారి వ్యాఖ్యలపై నేటి యువతులు సైతం అంతే రేంజ్‌లో కౌంటర్‌లు ఇస్తున్నారు.

తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ ప్రస్తుత సొసైటీలో మహిళలు వేసుకునే దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘ఈ రోజుల్లో మహిళలకు చిరిగిన దుస్తులు ధరించడం ఫ్యాషన్‌లా మారింది. ఇదెక్కడి సంస్కృతి అని విమర్శించారు. తీరగ్ సింగ్ ఓ పర్యటనలో భాగంగా తన పక్కన సీట్లో ఓ మహిళ కూర్చున్నదని, ఆమె చిరిగిన ప్యాంట్ వేసుకుందని గుర్తుచేశారు. ఆ మహిళతో సంభాషించినపుడు ఎన్జీవో నడిపిస్తున్నదని చెప్పినట్లు వివరించారు’.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ మనవరాలు ‘నవ్య నవేలి నందా’ ఘాటుగా స్పందించింది. ‘మహిళలు మార్చుకోవాల్సి తమ వేషాధరణ కాదని.. మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోవాలని’ కౌంటర్ ఇచ్చారు. ‘యువతులు చిన్న దుస్తులు ధరించి మోకాలు చూపిస్తున్నారు, పగిలిన జీన్స్ ధరిస్తున్నారు- ఇవి ఇప్పుడు ఇవ్వబడిన విలువలు’ అని తీరత్ సింగ్ వ్యాఖ్యనించగా… ‘‘మా బట్టలు మార్చే ముందు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి’’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. నవ్య తాను చిరిగిన జీన్స్‌ ధరించిన పిక్చర్ పోస్టు చేస్తూ .. ‘‘నేను గర్వంగా.. నా చీలిన జీన్స్ ధరిస్తాను’’ అని రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed