- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బచ్చన్ జీ సేవలు అసాధారణం : హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్
దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్’ అవార్డు అందుకోనున్నారు. సినీరంగ సంరక్షణకు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందించనుండగా, ఈ ఏడాది FIAF అవార్డుకు బచ్చన్ జీ సెలెక్ట్ అయ్యారు. కాగా హాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ ‘మార్టిన్ స్కోర్సెస్, క్రిస్టోఫర్ నోలన్’ అమితాబ్‌కు ఈ అవార్డు అందజేయనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ బిగ్ బీపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.
మార్టిన్ మాట్లాడుతూ.. ‘సినిమాను కాపాడుకోవడం అనేది బాధ్యత. భారత చలనచిత్ర వారసత్వాన్ని కాపాడేందుకు అమితాబ్ బచ్చన్ చేసిన సేవలు అసాధారణమైనవి. ఐదు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతున్న బచ్చన్ జీ.. భారతదేశంలో చలన చిత్ర సంరక్షణ, అభివృద్ధి, ప్రతిష్టకు గణనీయమైన కృషి చేశారు. ఈ సంవత్సరం FIAF అవార్డుకు అతన్ని ఎన్నుకునేందుకు గర్వంగా ఉంది’ అన్నారు. ఇక క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. ‘మన సినీ వారసత్వాన్ని కాపాడుకునేలా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కలిసి రావడం ఎంత అవసరమో నాకు తెలుసు. భారతదేశ చలనచిత్ర సంరక్షణకు గాను FIAF-2021 అవార్డును అమితాబ్ బచ్చన్ అందుకుంటున్నందుకు అభినందనలు’ అని తెలిపారు.