డిప్రెషన్‌పై బిగ్ బీ మనవరాలు..

by Jakkula Samataha |
డిప్రెషన్‌పై బిగ్ బీ మనవరాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు, శ్వేతా బచ్చన్ కూతురు అయిన నవ్య.. డిప్రెషన్ గురించి జరిగిన చర్చలో చాలా విషయాలు షేర్ చేసుకుంది. యూకేలో గ్రాడ్యుయేట్ చేసిన నవ్య.. తీవ్రమైన ఆందోళనతో బాధపడినట్లు తెలిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన చర్చలో పాల్గొన్న ఆమె.. డిప్రెషన్ వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కంట్రోల్ అయిందని, కాబట్టి ప్రజలు ఈ విషయంలో త్వరగా మేల్కోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

వారానికి ఒకసారి సెషన్స్‌కు హాజరవుతున్నట్లు తెలిపిన నవ్య.. లైఫ్‌లో పాజిటివ్ మనుషులు చుట్టూ లేకపోతే ఎలా ఉంటుందో అనుభవించానని చెప్పింది. ఇది చాలా ప్రతికూల ఫలితాన్నిస్తుందని తెలిపింది. కేవలం తన విషయంలో మాత్రమే కాదు.. ప్రపంచమంతటా ఇలాగే జరుగుతుందని.. అందుకే నేను మంచి మిత్రులతో గడపడం ప్రారంభించాకే డిప్రెషన్ నుంచి బయటపడగలిగానని చెప్పింది.

కాగా, ఈ చర్చను చూసి చలించిపోయింది నవ్య తల్లి శ్వేతా బచ్చన్. ధైర్యవంతురాలు అంటూ కూతురికి కాంప్లిమెంట్స్ ఇస్తూ మురిసిపోయింది.

Advertisement

Next Story