బాబ్రీ మసీద్ కేసు: అద్వానీతో షా భేటీ

by Shamantha N |
బాబ్రీ మసీద్ కేసు: అద్వానీతో షా భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈనెల 24న సీబీఐ కోర్టు ముందు అద్వానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అద్వానీతో భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన ఇరువురు చర్చించినట్లు సమాచారం. దాదాపు 30 నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది. అలాగే ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి రావాల్సిందిగా అద్వానీని షా కోరారు. భూమిపూజ కార్యక్రమానికి మోదీ, అమిత్ షా, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్ నాథ్ సింగ్, ఉమాభారతి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో 50 మంది వీఐపీలతో పాటు మొత్తం 200 మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Advertisement

Next Story