నిర్మల్‌లో బాంబు పేల్చిన అమిత్ షా.. కేసీఆర్‌కు టెన్షన్ స్టార్ట్..!

by Anukaran |   ( Updated:2021-09-18 01:16:23.0  )
నిర్మల్‌లో బాంబు పేల్చిన అమిత్ షా.. కేసీఆర్‌కు టెన్షన్ స్టార్ట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేతలు మళ్లీ జోష్‎లోకి వచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన బీజేపీ తెలంగాణ శ్రేణులను అయోమయంలో పడేశాయి. ఒక దశలో మాజీ మంత్రి, హుజురాబాద్​ బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్​ సైతం సందిగ్ధంలో పడ్డారు. ఎంతలా అంటే బీజేపీ, టీఆర్‌ఎస్​ దోస్తీపై వచ్చే అనుమానాలన్నీ నిజమని నమ్మే పరిస్థితికి తీసుకువచ్చాయి. అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత బీజేపీపై టీఆర్‌ఎస్​ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు అడుగులేసింది.

కానీ, ఇదే సమయంలో అమిత్​షా టూర్​ కొత్త మార్పులు తీసుకువచ్చింది. టీఆర్‌ఎస్‌ను రాజకీయ శత్రువుగానే చూస్తామని ఆయన సంకేతాలిచ్చారు. అమిత్ షా రాకతో చాలా రోజుల తర్వాత ఈటల రాజేందర్​ ముఖంలో కొత్త కళ వచ్చింది. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత ఆందోళనకరంగా ఉన్నట్టు కనిపించిన ఈటల రాజేందర్​.. నిర్మల్‌లో అమిత్​షా సభ తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.

ఏది ఏమైనా హుజురాబాద్‌లో ఈటలదే గెలుపు అనే చందంగా ఇప్పటికే పరిస్థితులు ఉన్నప్పటికీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యవహార శైలిపై ఒకింత ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఆ అనుమానాలకు చెక్​ పడింది. తమకు ఈటల రాజేందర్ ముఖ్యం అనే తీరుతో అమిత్​షా ప్రకటించారు. ఈటలను సభా వేదికగా మరోసారి అక్కర్లేని పరిచయం చేశారు. అంతేకాకుండా, కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే తీరుతో ప్రసంగించారు. చాలా ప్లాన్‌గా టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విమర్శించారు. ఇప్పుడు ఇలాంటి రాజకీయమే అవసరమంటూ అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. మొన్నటికిమొన్న ఢిల్లీలో ముద్దులాట.. గల్లీలో గుద్దులాట అంటూ వచ్చిన విమర్శలను వ్యూహాత్మకంగానే అమిత్ షా తిప్పి కొట్టారు.

ఈటలకు పెరిగిన ప్రాధాన్యత

అమిత్​షా సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఒక్కసారిగా మైలేజ్​వచ్చింది. మొన్నటిదాకా కొంత నిరుత్సాహంలో ఉన్న హుజురాబాద్​ ప్రాంత నేతలకు నిర్మల్ ​మీటింగ్ ​చాలా ఊపు తీసుకువచ్చింది. ఇదే సమయంలో రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం పక్కకు నెట్టి ఈటలకు పెద్దపీట వేశారు. అంతేకాకుండా, ఈటలను సెంటర్ ​ఆఫ్ అట్రాక్షన్‌గా చూపించారు. బైపోల్​ వస్తుందంటూ అమిత్​షా సూచించారు. అమిత్​షా మాటల ప్రకారం హుజురాబాద్‌కు త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొత్త చర్చ మొదలైంది. దీనికితోడు వెనక సీట్‌లో ఉన్న ఈటలను ముందుకు తీసుకురావడం విశేషం. ఈ ప్రాధాన్యతతో అటు ఈటలకు, ఇటు ఈటల వర్గానికి కొత్త జోష్ ​తెచ్చింది. సభా ప్రాంగణంలో కూడా ఈటల నినాదాలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈటల వర్గంలో కొత్త ఊపు వచ్చింది.

శేరిలింగంపల్లిలో పాగా వేసేది ఎవరు.?టీఆర్ఎస్‌లో విభేదాలు, కమలంలో కలకలం, హస్తానికి బీటలు..

సభలు, సమావేశాలతో నేతలు ఫుల్ బిజీ..

Advertisement

Next Story

Most Viewed