- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ ఆర్డరిస్తే.. ఫ్రీ క్యాష్! ఎక్కడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఏదైనా రెస్టారెంట్‌కెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఏమవుతుంది? వెంటనే అక్కడి సిబ్బంది మనం ఆర్డర్ చేసిన ఐటమ్‌ను సర్వ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇక్కడొక రెస్టారెంట్‌లో మాత్రం ఆర్డర్ చేసిన ఫుడ్‌తో పాటు డబ్బులు, విలువైన గ్యాడ్జెట్లు, ఐప్యాడ్స్, ఐఫోన్లు కూడా ఇస్తున్నారు. ఎక్కడో తెలుసా?
అమెరికన్ ఫేమస్ యూట్యూబర్ జిమ్మి డొనాల్డ్‌సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్.. ఇటీవలే ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. ‘మిస్టర్ బీస్ట్ బర్గర్’ పేరిట ప్రారంభమైన ఈ రెస్టారెంట్ గురించి తెలిపేందుకు బీన్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియోకు ఇప్పటి వరకు 23 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇంతకీ ఆ వీడియోలో మిస్టర్ బీస్ట్ ఏం చెప్పాడంటే.. తను కొత్తగా ప్రారంభించిన ‘మిస్టర్ బీస్ట్ బర్గర్’ రెస్టారెంట్‌కు ప్రచారం కల్పించేందుకు గాను ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రతీ కస్టమర్‌కు ఫ్రీగా డబ్బులు, ఇతర గ్యాడ్జెట్స్ ఇస్తున్నట్లు అందులో వివరించాడు. ఈ ప్రకటన చూసిన నగరవాసులు ఇప్పుడు మిస్టర్ బీస్ట్ రెస్టారెంట్ల ఎదుట బారులు తీరుతున్నారు.
రెస్టారెంట్ సిబ్బంది.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కొంత మంది కస్టమర్లకు ఐప్యాడ్‌లు ఇవ్వగా, మరి కొందరికి ఐఫోన్లు కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మా దేశంలో ఇలాంటి రెస్టారెంట్ ఎప్పుడొస్తుందో? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మిస్టర్ బీస్ట్ వద్ద చాలా డబ్బులున్నాయని, ఆ దేశవాసులు ఎంతో అదృష్టవంతులని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.