సాహిత్యంలో అమెరికన్‌ కవయిత్రికి నోబెల్..

by vinod kumar |
సాహిత్యంలో అమెరికన్‌ కవయిత్రికి నోబెల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతోంది. నిన్న రసాయనిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు మహిళలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం వరించగా.. తాజాగా సాహిత్యంలో విశేష ప్రతిభ కనబరిచన ‘అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్‌’ కు నోబెల్ బహుమతి వరించింది.

ఆమె ప్రస్తుతం యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా కొనసాగుతోంది. దానితో పాటే ఇప్పటివరకు 12 కవితా సంపుటాలను లూయిస్ వెలువరించింది. 2014లో ఫెయిత్ ఫుల్, వర్చువల్ నైట్ శీర్షికలతో ఆమె సంకలనాలు విడుదలయ్యాయి. అంతకుముందు 1993లో పులిట్జర్ ప్రైజ్, 2014లో నేషనల్ బుక్ అవార్డును కూడా ఆమ సొంతం చేసుకుంది. సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రఖ్యాత కవయిత్రిగా లూయిస్ గ్లక్ పేరు గాంచినది.

Advertisement

Next Story

Most Viewed