- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీ అవార్డు కావాలా? … ఒక్క స్వీట్ బాక్స్‌తో పని అయిపోతుంది: సింగర్
దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానులు ఎదురుచూస్తున్న 63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మరో మూడు రోజుల్లో(మార్చి 14) అంగరంగవైభవంగా జరగనుంది. లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రోగ్రామ్ జరగనుండగా… ఎవరు ఏ కేటగిరిలో అవార్డు పొందుతారనే చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో అమెరికన్ సింగర్ అండ్ రైటర్ జైన్ మాలిక్ గ్రామీ అవార్డుల నామినేషన్స్ పారదర్శకంగా జరగడం లేదంటూ తనదైన స్టైల్‌లో ట్వీట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. జ్యూరీకి, ఇందుకు సంబంధించిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, బహుమతులు పంపించకపోతే నామినేషన్ పరిగణలోకి తీసుకోరని ఆరోపించారు.
నెక్స్ట్ ఇయర్ స్వీట్ బాక్స్‌లు పంపిస్తాను అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు జైన్ మాలిక్.తన ట్వీట్ వ్యక్తిగతమైనది లేదా అర్హత గురించి కాదని, నామినేషన్ ప్రక్రియలో ట్రాన్స్‌పరెన్సీ పాటించకపోవడం గురించి అని తెలిపిన జైన్ మాలిక్.. ఫేవరెటిజం, రేసిజం, నెట్‌వర్కింగ్ పాలిటిక్స్ ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయన్నాడు.