- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ కుటుంబంలో విషాదం
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు రాబర్ట్ ట్రంప్ శనివారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. శుక్రవారం రాత్రి న్యూజెర్సీకి వెళ్ళిన ట్రంప్ తన తమ్ముడిని పరామర్శించేందుకు న్యూయార్క్ వెళ్లాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈలోపే తమ్ముడు మరణించడంతో తీవ్ర వేదనకు గురైనట్లు వెల్లడించారు.
1948లో జన్మించిన రాబర్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు. రాబర్ట్ మృతికి డొనాల్డ్ ట్రంప్ బరువెక్కిన హృదయంతో సంతాపం తెలిపారు. ‘నా సోదరుడు ఒక అద్భుతం, మొదటి నుండి మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి మరణించాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్. ఇక మీదట విశ్రాంతి తీసుకో’ అని అమెరికా అధ్యక్షుడు తన బాధను ఒక ప్రకటన ద్వారా వ్యక్తం చేశారు.
72 ఏండ్ల రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతూ మన్హటన్‌లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన ట్రంప్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో రాబర్ట్ ట్రంప్ తన సోదరుడితో పాటు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు.