‘ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేది అమెరికానే’

by vinod kumar |
‘ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేది అమెరికానే’
X

వాషింగ్టన్: కరోనాకు టీకా సిద్ధమయ్యాక అమెరికానే ప్రపంచదేశాలకు సరఫరా చేస్తుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా కోసం వేగంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చర్యలు ఊపందుకున్నాయని వివరించారు. వెంటిలేటర్ల తరహాలోనే ఇతర దేశాలకు ఈ టీకాను అమెరికా సరఫరా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికాకు చెందిన మొడెర్నా టీకా ఈ ఏడాది చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ టీకా సోమవారమే మూడో దశ ట్రయల్స్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలుసైట్‌లలో 30వేల మందికి ఈ టీకాను ప్రయోగించనున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story