- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిబన్లకు భారీ షాకిచ్చిన అమెరికా..
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లకు భారీ షాకిచ్చింది. గత 20 ఏళ్లకు పైగా ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లను నిలువరిస్తూ వచ్చిన అమెరికా ఒక్కసారిగా శాంతిచర్చల పేరుతో యూఎస్ దళాలను వెనక్కి పిలిపించుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నేళ్లు ప్రజలు మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోగా తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఆయుధాల అమ్మకం నిలిపివేస్తూ అమెరికా నిర్ణయించింది.
ఈ మేరకు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేలా అమెరికా విదేశాంగ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగుమతి చేసిన ఆయుధాల లైసెన్సులను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతి అయిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ-259 సూపర్ టుకానో అటాక్ విమానాలు, రైఫిల్స్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల చేతుల్లోకి వెళితే.. ఇతర దేశాల భద్రతకు పెనువిపత్తుగా మారవచ్చని భావించిన అగ్రరాజ్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ నిపుణులు భావిస్తున్నారు.