- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక నిరుద్యోగం
వాషింగ్టన్: కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికా ఈ మహమ్మారి కారణంగా మరో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నది. కరోనా వైరస్ దెబ్బకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రికార్డ్ స్థాయి నిరుద్యోగాన్ని చవిచూస్తున్నది. కరోనా కట్టడికి సర్కారు నిర్ణయాలు, ఆర్థిక సేవల స్తంభనతో దేశ ఎకానమీ దెబ్బతిన్నది. ఈ పరిస్థితి లేబర్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వివరించింది.
దేశంలో ఉన్న 50 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ రేటు మరింత పెరిగింది. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం రికార్డ్ నిరుద్యోగ రేటు నమోదైనట్టు అమెరికా కేంద్ర బ్యాంక్ కాంగ్రెస్‌కు సమర్పించిన మానిటరీ పాలసీ రిపోర్ట్‌లో పేర్కొంది. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు అత్యధికంగా 14.7శాతానికి పెరిగిందని, అటుతర్వాత మే నెలలో స్వల్పంగా తగ్గి 13.3శాతానికి చేరిందని ఆ రిపోర్ట్ తెలిపింది. దేశంలో కరోనా కారణంగా ఫిబ్రవరి నుంచే ఉద్యోగాల కోత మొదలైంది. తద్వారా దాదాపు రెండు కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఆ రిపోర్ట్ వివరించింది.
10 ఏళ్లుగా సృష్టించిన ఉద్యోగాలకు ఇవి సమానమని తెలిపింది. ఈ బ్యాంక్ చైర్మన్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నిరుద్యోగ రేటు మరింత ఎక్కువగానే ఉండొచ్చనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగాల్లో ఉన్నామని చెబుతూ ప్రస్తుతం విధులు నిర్వహించడంలేని వారినీ లెక్కల్లోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు మరో మూడు శాతం పెరిగేదని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయినవారిలో చాలా మంది తక్కువ వేతనాలు అందుకునేవారే ఉన్నారని, తక్కువ మొత్తంలో వేతనాలను అర్జించే సమూహాలే ఎక్కువగా నష్టపోయారని వివరించారు. అంతేకాదు, ఈ మహమ్మారి కారణంగా లక్షలాది అమెరికన్లు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుదీర్ఘకాల మానిటరీ సపోర్ట్ అవసరమని తెలిపారు.