- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎ‘టాక్’ చేసి..ఏ ‘టాక్స్’ చేస్తడో..
దిశ, హైదరాబాద్‌బ్యూరో:
ఇండియా మొత్తం గుజరాతే చూస్తోంది.
అమెరికా ఆల్సో. అంతేకాదు..టోటల్ వరల్డ్ లుక్ అటే!
దుంప దెంచ! అహ్మదాబాద్‌లో ట్రంపు దిగిండు కదా!
ఎంత గడసరి అయినా, అగ్ర రాజ్యానికి బాస్ కమ్ ప్రపంచానికే ‘పెద్దన్నా’యే.
అందుకే వచ్చే ఫైవ్ డేస్ ముందు నుంచి
టుడే, టుమారో ప్లస్ టాటా చెప్పాక ఇంకో టూ త్రీ డేస్.
టోటల్‌గా ఓ టెన్ డేస్ అనుకో! ట్రంపు టాకే.
మరదేంటీ? నిన్న మొన్న ఏదో ఎ‘టాక్’చేశాడూ?
భారత్ ఇబ్బంది పెడుతోందనీ, సుంకాలేస్తోందనీ?
ఎవరైనా, ఎంతటి వారైనా శుభమా అంటూ వచ్చే ముందు అట్లేనా అనేదీ?
అలా కామెంట్లు చేయకపోతే ఆయన ట్రంపు ఎట్లా అవుతాడూ?
అయినా, పుణ్యమైన వేద భూమికి వచ్చే
టైంలో ఫ్లయిట్ ఎక్కే ముందు కాస్త సాఫ్ట్‌గానే మెసేజ్ ఇచ్చాడులే!
మోడీ తన ఫ్రెండనీ, గొప్ప స్నేహితులను కలువబోతున్నాననీ!
అది సరే. ఇంతకీ మన దేశానికి ఫాయిదా ఏంటో?
మ్యూచువల్ బెనిఫిట్స్, టెర్రరిజం మీద ఫైట్,
మత సామరస్యం, వాణిజ్య ఒప్పందాలు వగైరా!
అహ్మదాబాద్ సిటీలో వంద కోట్లు పోశారట(?)
అట్లాంటివి కామనే! మన హైదరాబాద్‌కు
ట్రంపు డాటర్ ఇవాంకా 2017లో వచ్చి,
తిరిగిన రూట్లలోనూ మెరుగులద్దారు, యాదికున్నదా?
అయితాయే గనీ, 70 లక్షల మందని ఓసారి,
కోటి పబ్లిక్ వెల్‌కమ్ చెబుతరని ఓసారి ట్రంపు చెప్పుకొన్నడు!
తెలంగాణ, ఇండియా అనే కాదు,
అమెరికా లీడర్లకు సుత జనం పిచ్చి అని అర్థమైందా!
2010 అండ్ 2015ల ఒబామా వచ్చిండు.
ఆయన్ను అమెరికా ప్రెసిడెంటుగా ఎంతో గౌరవంగా చూసినం.
ట్రంపుది గుడ్క అదే హోదా. కానీ, టెంపరితనం ఎక్కువ కదా.
కాబట్టి, హానర్ చేస్తూనే మనమూ కొంచెం వెటకారం చేయాలే!
మన టెకీలను, అదర్సును H1B వీసాల
విషయంలో మస్తు ఇబ్బందులకు గురి చేస్తుండు కదా.
అది చాలదన్నట్టు అభివృద్ధి చెందుతున్న
కంట్రీల లిస్టులోంచి ఎగరగొట్టేశాడట ఆ కంత్రీ(?)
రేపటి మీటింగ్‌లో మోడీసాబ్ ఇసొంటియి
పాయింటవుట్ చేస్తారో లేదో? చూడాలి.
పాడి, కోళ్ల పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలని
జెస్ట్ మొన్నంటే మొన్న సాటర్‌డే
నాడే ఉపరాష్ట్రపతి వెంకయ్య మరోసారి సిటీలో పిలుపిచ్చారు.
మరోవంక సరిగ్గా, ఆ దేశీయ రంగాలనే నాశనం
చేసేలా మోడీ సర్కార్ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి
రెడీ అయిందని ప్రజా సంఘాలు ఫైరవుతున్నై.
ప్రొటెస్టు చేయాలని పిలుపుచ్చినై.
ఏంటో అగ్రిమెంట్ల మాయ! సమాజానికి ఓ పట్టాన సమజవదు.
పోయినతాప ఓ దేశం కో-‘ఆపరేషన్’తో గట్టెక్కిన ట్రంపు..మరోసారి గెలిచేందుకు
ఇంకో కంట్రీతో డీల్ చేస్తున్నాట్ట? ష్..!
పాలి‘ట్రిక్స్’యాడైనా పాలిట్రిక్సే! కలియుగంల శుద్ధపూసలు యాడున్నరు గాక!
ఇంకా విశేషాలు? లేకేం. దునియలకెల్లా టాప్ ప్రొటెక్షన్, హెవీ మర్యాదలు.
ఉత్తర కొరియా కిమ్ భాయ్ కంటేనా?
అయ్యో, ఆ సారు కథ వేరేలే! చెప్పుకోబోతే ఈడ జాగ చాలదు.
షాజహన్ ప్రేమ సౌధం తాజ్‌మహల్ విజిట్‌కు
ట్రంపు తెగ ముచ్చట పడుతున్నాట్ట!
అవ్ మరి, అతను ట్రంపు, మరిచావా, ఏంటీ?
లవర్సు, గాళ్ ఫ్రెండ్సూ, మాజీ భార్యలు సారుకు బొచ్చెడాయే!
మన మోడీ సాబ్‌కు ఇండియానే బిగ్ ఫ్యామిలీ,
ట్రంపునకు మాత్రం సొంతంగానే పే..ద్ద కుటుంబముండే!
ఫైనల్‌గా ఫినిషింగ్ టచ్ కావాలా!
ఇండియా, అమెరికా ప్రెసిడెంట్ల విందులో
మన పెద్ద సార్ కేసీఆర్‌కూ ఇన్విటేషనుంది.
మన సీఎం ఏక్‌ధమ్ గిఫ్టు కమ్ డైలాగులతో
తెలంగాణ స్పెషాలిటీని ఎట్లా అట్రాక్ట్ చేస్తారో చూడాలి!
Read also..