భారత్ అంటే గౌరవం : ట్రంప్

by Shamantha N |
భారత్ అంటే గౌరవం : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్ అంటే అమెరికన్లకు ప్రేమ, గౌరవం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌కు అమెరికా విశ్వసనీయమైన ఫ్రెండ్ అని తెలిపారు. ఎనిమిది వేల మైళ్లు ప్రయాణించి నేరుగా ఈ సందేశాన్ని భారతీయులందరికి తెలియజెప్పేందుకు ఇక్కడకు చేరుకున్నామని తెలిపారు. మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ 70 ఏళ్లలో అనూహ్యమైన పురోభివృద్ధి సాధించిందని కొనియాడారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఎన్నో విజయాలు కైవసం చేసుకున్నదని వివరించారు. ప్రపంచమానవాళికి భారత్ ఒక ఆశాజ్యోతి అని ప్రశంసించారు.

కష్టపడితే ఏదైనా సాధించవచ్చునని చెప్పడానికి భారత ప్రధాని మోడీ నిలువెత్తు నిదర్శనమని ట్రంప్ అన్నారు. ఆయన రేయింబవళ్లు కష్టపడతారని వివరించారు. మోడీ టీస్టాల్‌లో టీ అమ్మాడని గుర్తుచేశారు. మోడీ నా మిత్రుడని గర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. భారత్ ప్రపంచానికి ఎంతో సేవ చేసిందని వివరించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల్లాంటి దిగ్గజ క్రికెటర్లను భారత్ అందించిందని చెప్పారు. బాలీవుడ్ సృజనాత్మకతకు ఒక హబ్ అని తెలిపారు. ఈ హబ్‌ సృజించిన సినిమాలెన్నో ప్రపంచదేశాల ప్రజలు వీక్షించి ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. భారత్‌తో అమెరికా తన బంధాన్ని మరింత బలపరుచుకుంటుందని వివరించారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై రేపు సంతకాలు జరుగుతాయని ప్రకటించారు.

Read Also..

సామ్‌కు మద్దతిచ్చిన హైదరీ

Advertisement

Next Story

Most Viewed