అంబులెన్సుల్లో ప్రజా రవాణా

by Shyam |   ( Updated:2023-12-16 17:54:00.0  )
అంబులెన్సుల్లో ప్రజా రవాణా
X

కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి. ఎక్కడిక్కడ రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయ్. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, మెట్రో సర్వీస్ అన్ని కూడా క్లోజ్ చేశారు. దీంతో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యాన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లు కక్కుర్తితో సొమ్ము చేసుకుంటున్నాయి. దొంగచాటుగా ప్రైవేట్ అంబులెన్సులు ప్రయాణికులను తరలిస్తున్నాయి. పేషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. హైవే రోడ్లపై చెకింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed