One-way effect.. కోదాడలో అంబులెన్స్‌కు దారి లేదు..!

by Anukaran |
One-way effect.. కోదాడలో అంబులెన్స్‌కు దారి లేదు..!
X

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో లాక్‎డౌన్ అమలులో భాగంగా పలు ప్రధాన కూడళ్లలో పోలీసులు రహదారికి అడ్డంగా కర్రలు కట్టి వన్ వే చేశారు. ఖమ్మం క్రాస్ రోడ్, బస్ స్టాండ్ సెంటర్, రంగా థియేటర్ సెంటర్‌లలో రావడానికి పోవడానికి ఓకే దారిని అందుబాటులో ఉంచారు. దీంతో సడలింపు సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డుమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ క్రమంలో సోమవారం ఓ అంబులెన్సు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్‌ అరగంటకు పైగా అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడిన ఘటనతో బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఘటనపై అధికారులు తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు.

నాలుగు గంటల్లో నానా ఇబ్బందులు

మరో వైపు లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రహదారులు మూసివేయడం పై మండిపడుతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. రహదారికి అడ్డంగా కట్టిన కర్రలు తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనం అంతా ఒకే దగ్గర గుమిగూడితే కరోనా రాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వన్ వే కారణంగా రద్దీ పెరుగుతోందని.. మినహాయింపు సమయంలో రహదారులు మొత్తం ఓపెన్‌ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed