లాస్ట్‌ రైడ్ సర్వీస్ పేరిట అంబులెన్స్ సేవలు

by Shyam |
లాస్ట్‌ రైడ్ సర్వీస్ పేరిట అంబులెన్స్ సేవలు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాలు చేసేందుకు పోలీసులు అంబులెన్స్‌ సర్వీసును ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం అంబులెన్స్ సేవలను లాస్ట్ రైడ్ సర్వీస్ పేరిట సీపీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. కొవిడ్‌తో మరణించిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సేవలు అవసరమైన వారు 84998 43545 నెంబర్ తో పాటు 90006 33249 (ప్రదీప్), 95022 88787 (సాయితేజ), 77998 80442 (రామంజీత్) నెంబర్లకు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story