- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి 13నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం యూనివర్సిటీ విడుదల చేసింది. ఫస్లియర్ విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలను మార్చి 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. రెండో ఏడాది విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు 21 నుంచి 27 వరకు జరుగుతాయి. పరీక్షలు రాసే విద్యార్థులు ఫిబ్రవరి 16లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు జరుగుతాయని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షల నిర్వాహకులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్ల ద్వారా కానీ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఆన్ లైన్లోనే చెల్లింపులు ఉంటాయన్నారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 040-23680241/254 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చునని యూనివర్సిటీ అధికారులు సూచించారు.