- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో కాదు.. క్యాస్ట్ వైరస్‌తోనే..
ఏపీలో ఎన్నికల వాయిదాపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కరోనా వైరస్‌తో కాదు.. క్యాస్ట్ వైరస్‌తోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియమితులయ్యారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఆశించినంత ఫలితాలు రావడం లేదు. టీడీపీ నిర్వీర్యం అయ్యే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం. మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే.. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రూ.5800 కోట్ల నిధులు రావు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కోసం రమేష్‌కుమార్ కుట్రపూరితంగా వ్యవహరించారు’ అని అంబటి ధ్వజమెత్తారు.
tag; ambati rambabu, ycp mla, ec, election, postponed