గుడ్ న్యూస్ : అమెజాన్ 'ప్రైమ్ డే సేల్‌'లో 2,400కి పైగా కొత్త ఉత్పత్తులు

by Harish |   ( Updated:2021-07-18 06:30:12.0  )
గుడ్ న్యూస్ : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో 2,400కి పైగా కొత్త ఉత్పత్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా భారత్‌లోని 100కు పైగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల(ఎస్ఎంబీ) వారు సంస్థ నిర్వహించే ప్రైమ్ డే సేల్‌లో 2,400కి పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తారని ఆదివారం వెల్లడించింది. ఈ నెల చివరి వారంలో 26-27 తేదీలలో అమెజాన్ నిర్వహించే అమ్మకాల కార్యక్రమం ప్రైమ్ డేలో 450కి పైగా నగరాల నుంచి 75 వేల మందికి పైగా అమ్మకందారులు ఇందులో భాగస్వామ్యం కానున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులతో సహా 100కు పైగా ఎస్ఎంబీలు విడుదల చేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఇంటి అవసరాలకు వాడే ఉత్పత్తులు, ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీ, కిరాణా, ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక్ విభాగాల్లో అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తారని అమెజాన్ వివరించింది.

‘కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చిన్న వ్యాపారాలు తిరిగి పుంజుకునేందుకు తమ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని’ అమెజాన్ ఇండియా ఎంఎస్ఎంఈ విక్రయ భాగస్వామి ప్రణవ్ భాసిన్ అన్నారు. అంతేకాకుండా రాబోయే పండుగ సీజన్, ప్రైమ్ డే అమ్మకాలకు ముందు తగినంత నిల్వ సామర్థ్యం కోసం 11 కొత్త గిడ్డంగులను ప్రారంభిస్తామని, ఇప్పటికే తొమ్మిది ఫుల్‌ఫిల్‌మెంట్ల సౌకర్యాలను విస్తరిస్తున్నామని, దీన్ని మరింత వేగంగా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ల సౌకర్యాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోని ఉంటాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed