- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చావుబతుకుల్లో కొరియోగ్రాఫర్.. ‘అమెజాన్’ తప్పేనా?
దిశ, సినిమా : న్యూజిలాండ్‌కు చెందిన ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ డాలా గ్రాంట్ తీవ్రంగా గాయపడ్డారు. అమెజాన్ ఒరిజినల్స్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సిరీస్ కోసం వర్క్ చేస్తున్న సమయంలో స్పృహతప్పి పడిపోయారు. దాంతో ఆస్పత్రికి తరలించగా సీరియస్‌గా ఉందని, వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇందుకోసం ఫండ్ రేజ్ చేస్తున్న సెలబ్రిటీల క్యాంపెయిన్‌పై న్యూజిలాండ్ మీడియా సంస్థ హెరాల్డ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమెజాన్ ప్రొడక్షన్ టీమ్ వర్క్ ప్లేస్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్స్ గురించి సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని తెలిపింది.
అయితే దీనిపై స్పందించిన అమెజాన్ ప్రతినిధి.. తమ కాస్ట్ అండ్ క్రూ హెల్త్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ వెల్ఫేర్ గురించి అమెజాన్ స్టూడియోస్ సీరియస్‌గా ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే న్యూజిలాండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం సెట్‌లో అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. తమ లోపం వల్లే స్టంట్ కొరియోగ్రాఫర్ సీరియస్‌గా ఉన్నారన్న ఆరోపణలు సమంజసం కాదన్న ఆయన.. స్టంట్ వర్కర్ డిఫరెంట్ ప్రొడక్షన్స్‌లో వర్క్ చేస్తూనే తమ టీమ్‌తో జాయిన్ అయిందని, అమెజాన్ సెట్స్‌లో చేరకముందే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్, రక్తనాళములు ఉబ్బడం వంటి ఇబ్బందులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన సాక్షాలు కూడా ఉన్నాయని తెలిపారు.