- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12 ఏళ్ల నిరీక్షణ.. కనువిందు చేసిన సుందర దృశ్యం
దిశ,ఆమనగల్లు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సురసముద్రం చెరువు అలుగు పారింది. సుమారు 12 ఏళ్ల కిందట అలుగు పారిన చెరువు ఈ యేడు కురుస్తున్న భారీ వర్షాలకు అలుగు పారడంతో రైతులు, పట్టణ ప్రజలు తమ నీటి బాధ తప్పుతుందని ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. పారుతున్న అలుగును పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. అదేవిధంగా అలుగు నీరు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ తండాల మధ్య ఉన్న కత్వ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది
దీంతో శంకర్ కొండ తండా, దెయ్యాల బోడు తండా, సామాయిపల్లి తండాలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కత్వ ప్రాంతాన్ని ఆమనగల్లు ఎస్ఐ ధర్మేష్ సందర్శించి ఆయా తండాల ప్రజలు వాగు ఉధృతి తగ్గే వరకు మండలంలోని పోలెపల్లి మీదుగా రాకపోకలు సాగించి ప్రమాదానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమనగల్లు సురసముద్రం అలుగును జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్, ఎంపీటీసీలు కుమార్, సరిత, సర్పంచులు సోన, శ్రీను, టీఆర్ఎస్ నాయకులు సందర్శించి పరిశీలించారు.