ఎవరేమనుకున్నా.. నేనిలాగే తింటా : అమలాపాల్

by Anukaran |   ( Updated:2020-08-05 00:41:21.0  )
ఎవరేమనుకున్నా.. నేనిలాగే తింటా : అమలాపాల్
X

అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకోగల నటిగా అమలాపాల్‌కు మొదటి నుంచి మంచి పేరుంది. ‘బెజవాడ’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ మళయాళీ ముద్దుగుమ్మ.. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, జనాలు గుర్తు పెట్టుకునేంత క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. చ‌ర‌ణ్‌తో ‘నాయ‌క్’.. బ‌న్నీతో ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో’ సినిమాల్లో న‌టించిన అమ‌లాపాల్‌కు ప్ర‌స్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో త‌మిళ, మ‌ల‌యాళ సినిమాల‌తో బిజీ అయింది. అప్పుడప్పుడు కొత్త ఫొటో షూట్‌లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన అందాలతో అదరగొడుతోంది అమల. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

‘అధికంగా తినడం.. ఓ శాపంలా చూస్తారు. చట్టాన్ని అతిక్రమించినంతగా ఫీలవుతారు. అలా ఎవరైనా అనుకుంటే అనుకోనీ.. నేను ఇలానే తింటాను’ అంటూ యమ్మీర్స్ ఆఫ్ కేక్ అంటూ.. ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇటీవలే ఓ మ్యాగజైన్ పిక్ పోస్ట్ చేసిన అమలాపాల్.. మ్యాగజైన్ ప్రారంభించి నేటితో ఒక సంవత్సరం పూర్తి కావడంతో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీలో మహేష్ భట్ జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నటిస్తోంది. బాలీవుడ్‌లో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న అమలాపాల్ కోరిక.. ఈ సంవత్సరం నెరవేరుతుండటంతో.. చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట.

https://www.instagram.com/p/CDd8hr4DhKP/

Advertisement

Next Story