- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సభలో కొత్త సంప్రదాయం వద్దు
దిశ, నల్లగొండ: మునుగోడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభలో ప్రోటోకాల్‌పై సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రోటోకాల్ విషయమై ఎంపీపీ కర్నాటి స్వామితో వాగ్వాదానికి దిగారు. పీఏసీఎస్ చైర్మన్‌ను వేదిక మీదకు పిలవాలంటూ ఆందోళనకు దిగారు. అయితే ఎంపీపీ, ఎంపీడీఓ స్పందిస్తూ మునుపెన్నడూ కూడా పీఏసీఎస్ చైర్మన్‌ను వేదికపైకి పిలవలేదని, కొత్త సంప్రదాయాన్ని తీసుకురావద్దని సూచించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పీఏసీఎస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అవ్వడం వల్లే వేదికపైకి పిలవటం లేదంటూ సమావేశాన్ని బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. స్థానిక జడ్పీటీసీ నారబోయిన స్వరూప స్పందిస్తూ.. మూడు నెలలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా చేస్తే, గ్రామాలలో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ధర్నా విరమించి సమావేశానికి హాజరుకావాలని ఆమె సూచించారు. సమావేశంలో ఎంపీడీవో యాకుబ్ నాయక్, తహసీల్దార్ దేశ్య, ఎంపీవో సునీత, వైస్ ఎంపీపీ అనంతవీణ పాల్గొన్నారు.