బెల్లంకొండ 'అల్లుడు అదుర్స్' లుక్ అదిరింది

by Shyam |
బెల్లంకొండ అల్లుడు అదుర్స్ లుక్ అదిరింది
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యాడు. అల్లుడు సెంటిమెంట్ వర్కౌట్ అవడం… సినిమా హిట్ కావడంతో అల్లుడు సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు. ఈ మధ్య ‘రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. తర్వాతి సినిమాకు ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌ను ఖరారు చేశాడు. సాయిశ్రీనివాస్‌కు జోడిగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ అలరించనున్నారు. సంతోష్ శ్రీనివాస్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని సుమంత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనుండగా.. ఏప్రిల్ 30న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్‌తో అల్లుడు అదుర్స్ అనిపించుకుంటున్న సాయి శ్రీనివాస్… మరోసారి మాస్ ఎంటర్టైన్మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు

tags : Alludu Adhurs, Bellamkonda Sai Srinivas, Rakshasudu, Alludu Seenu, DSP Musical, Santhosh Srinivas Routh

Advertisement

Next Story