నితిన్‌కు బన్నీ డబుల్ కంగ్రాట్స్

by Shyam |
నితిన్‌కు బన్నీ డబుల్ కంగ్రాట్స్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ … ‘అల వైకుంఠపురం’లో సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తుంది ఈ చిత్రం. కాగా శుక్రవారం విడుదలైన ‘భీష్మ’ చిత్రానికి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు బన్నీ. ‘భీష్మ’ సక్సెస్‌పై మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన… సినిమాను కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దిన డైరెక్టర్ వెంకీ కుడుములను ప్రశంసించాడు. సినిమాలో రష్మిక ఆల్ రౌండర్ అని కితాబు ఇచ్చిన బన్నీ… నిర్మాత ఎస్. నాగ వంశీకి సినిమా లాభాలు చేకూర్చుతుందని ట్వీట్ చేశాడు. జనవరి, ఫిబ్రవరి నిర్మాతకు చాలా బాగా కలిసొస్తాయని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఇక ‘భీష్మ’ హీరో నితిన్‌కు డబుల్ కంగ్రాట్స్ చెప్పాడు అల్లు అర్జున్. ఈ సినిమా సక్సెస్‌తో … వెడ్డింగ్ సెలబ్రేషన్స్ డబుల్ జోష్‌తో చేసుకోవచ్చన్నాడు. నీకు సరైన టైంలో మంచి జరుగుతుందన్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా ఫిబ్రవరి 15న నితిన్‌కు తన స్నేహితురాలు షాలినితో నిశ్చితార్ధం జరిగింది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభం కాగా…. ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడు నితిన్. ఇందుకు సంబంధించిన పనులను తన సోదరి చూసుకుంటోంది.

Read Also..

21వేల కోట్ల డిఫెన్స్ డీల్

Advertisement

Next Story