- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షూటింగ్ ఆపేసి అక్కడ ప్రత్యక్షమైన బన్నీ.. అసలేం జరిగింది..?
దిశ, శంకర్పల్లి: సినీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శంకర్పల్లి తహసిల్దార్ కార్యాలయంలో సందడి చేశారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో అల్లు అర్జున్ సర్వేనెంబర్ 526, 527, 528లలో రెండు ఎకరాల అయిదు గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఉదయం ఆయన శంకర్పల్లి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం తహసిల్దార్ రిజిస్ట్రేషన్ పత్రాలను అల్లు అర్జున్ కు అందజేశారు. బన్నీ శంకర్పల్లి కి వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తహసిల్దార్ కార్యాలయానికి విచ్చేసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. కాగా శంకర్పల్లి మండలంలో ఇటీవల కాలంలో సినిమా హీరోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల చాలామంది ప్రముఖులు తహసిల్దార్ కార్యాలయంకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్లిన సంగతి తెలిసిందే.
Icon StAAr #AlluArjun registered 2 acres of Janavada village land at Shankarpalli Tahasildar office today at 10 am. pic.twitter.com/m8CtEkUb18
— Milagro Movies (@MilagroMovies) October 8, 2021
- Tags
- allu arjun