ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతివ్వండి- జీహెచ్ఎంసీ

by Shyam |   ( Updated:2021-09-12 23:12:55.0  )
ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతివ్వండి- జీహెచ్ఎంసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక ఉత్సవాల నేపథ్యంలో పీవోపీ విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నిమజ్జనాలపై ఇచ్చిన తీర్పును తిరిగి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని ఆయన కోరారు.

ఆయన కోర్టుకు కోరినవాటిలో ‘‘పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేసి అనుమతించాలి. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలి. రబ్బర్ ట్యూబ్ ట్యాంకులు నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలి. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే తీవ్ర గందరగోళం తలెత్తుతుంది. ఇప్పటికే విగ్రహాలు ఆపితే వాహనాలు రోడ్లపై నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని, హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుంది’’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story