ఎంపీ విజయసాయిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు !

by srinivas |
ఎంపీ విజయసాయిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు !
X

దిశ, విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ వాల్తేరు క్లబ్‌లో మొదలుపెట్టి భీమినిపట్నం బీచ్‌వరకు ముఖ్యమైన స్థలాలను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలనతో పాటు విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందన్నారు. వైసీపీ నేతలు, అధికారులు కలిసి ప్రభుత్వ స్థలాలను దోచుకుంటున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Advertisement

Next Story