అది జర్నలిస్టులకు… రక్షణ కవచంలా తయారయింది

by Shyam |   ( Updated:2020-08-21 07:41:16.0  )
అది జర్నలిస్టులకు… రక్షణ కవచంలా తయారయింది
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుటకుంటున్నట్టు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు రూ.కోటికి పైగా ఆర్థికసాయాన్ని అందించినట్టు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం… తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యిందన్నారు.

ఆ వంద కోట్ల నిధుల నుండి రూ.34.50 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. ఆ నిధి ద్వారా వచ్చిన వడ్డీతో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ.కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థికసాయం అంజేసినట్టు అల్లం నారాయణ తెలిపారు. దీనితోపాటు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు రూ.5 కోట్ల 12 లక్షల సాయం అందించామని తెలిపారు. దీంతో పాటు లాక్‌డౌన్ సమయంలో దాదాపు 1200 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, సానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశామని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటివరకూ 260 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ. 2కోట్ల 60 లక్షలు అందించామని తెలిపారు.ని, అలాగే దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన 94 మంది జర్నలిస్టులకు 50 వేల రూపాయల చొప్పున 47 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed